రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు.. తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2022-06-18T00:01:08+05:30 IST

రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో మాజీమంత్రి నారాయణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు

రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు.. తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు

అమరావతి: రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో మాజీమంత్రి నారాయణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరిచింది. కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్‌ అధినేత బాబి, లింగమనేని గ్రూప్‌కి చెందిన రమేష్‌, రాజశేఖర్‌ బెయిల్ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. 


రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్‌, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్‌, ఏ6గా హెరిటేజ్‌ ఫుడ్స్‌‌ను చేర్చారు. వీరందరిపైనా సెక్షన్లు 120బీ, 420, 34, 35, 36, 37, 166 కింద కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌: 16/2022. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-06-18T00:01:08+05:30 IST