ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై షాక్.. జగన్ ఇప్పుడు ఏం బోయబోతున్నారు?

ABN , First Publish Date - 2021-01-20T01:15:46+05:30 IST

ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై షాక్.. జగన్ ఇప్పుడు ఏం బోయబోతున్నారు?

ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై షాక్.. జగన్ ఇప్పుడు ఏం బోయబోతున్నారు?

హైదరాబాద్/అమరావతి: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఏపీ రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ.. సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొంత మంది..రాజధానిలో భూములు ముందుగానే కొనుగోలు చేశారని సీఐడీ కేసులు నమోదు చేసింది. రాజధానిలో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసింది.


భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. ప్రభుత్వం కక్షసాధిస్తోందని పేర్కొంటూ కిలారు రాజేష్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరగలేదని పేర్కొంటూ.. దీనికి ఐపీసీ సెక్షన్లకు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది.


ఈ నేపథ్యంలో  ‘‘ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై తీర్పులో హైకోర్టు ఏం చెప్పింది?. ఎగిరెగిరిపడ్డ జగన్ సర్కార్‌కు తల బొప్పి కట్టిందా?. ఫిర్యాదు లేకుండా కేసులేంటని కోర్టు ప్రశ్నతోనైనా జ్ఞానోదయం అవుతుందా?. ఇన్ సైడర్ కేసు తీర్పు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి?. అవినీతి జరిగినందువల్ల రాజధాని తరలిస్తామన్న జగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు?’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2021-01-20T01:15:46+05:30 IST