Abn logo
May 29 2020 @ 16:15PM

వలసకూలీలు ఇబ్బంది పడుతున్నారన్న వ్యాజ్యంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్‌: వలసకూలీలు ఇబ్బంది పడుతున్నారన్న వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. సామాజిక కార్యకర్త రమా మెల్కొటే పిల్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. మేడ్చల్‌లో ప్రస్తుతం వలసకూలీలు లేరని, స్వస్థలాలకు తరలించామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మేడ్చల్‌లో ఇప్పటికీ వందలాది వలసకూలీలు ఉన్నారని న్యాయవాది వసుధ నాగరాజు కోర్టుకు తెలిపారు. మేడ్చల్ వెళ్లి పరిశీలించేందుకు అడ్వొకేట్ కమిషన్‌గా పవన్‌కుమార్‌ను ధర్మాసనం నియమించింది. అడ్వొకేట్ కమిషన్‌తో పాటు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై విచారణను జూన్ 2కి హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement
Advertisement
Advertisement