తప్పిపోయిన బాలలపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

ABN , First Publish Date - 2021-04-16T09:26:29+05:30 IST

తప్పిపోయిన బాలలను గుర్తించి, ఎంతమందిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారని హైకోర్టు ప్రశ్నించింది. తప్పిపోయిన పిల్లలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉన్నందున అంతర్రాష్ట్ర పోలీసులు, అధికారులతో సంప్రదింపులు

తప్పిపోయిన బాలలపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): తప్పిపోయిన బాలలను గుర్తించి, ఎంతమందిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారని హైకోర్టు ప్రశ్నించింది. తప్పిపోయిన పిల్లలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉన్నందున అంతర్రాష్ట్ర పోలీసులు, అధికారులతో సంప్రదింపులు జరపాలని స్పష్టం చేసింది. ‘‘రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో పిల్లలు తప్పిపోయిన కేసులు ఎన్ని నమోదయ్యాయి? ఎన్ని కేసుల్లో పిల్లలను గుర్తించగలిగారు?’’ వంటి విషయాలు వివరిస్తూ కౌంటర్‌ వేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీజే హిమా కోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. 

Updated Date - 2021-04-16T09:26:29+05:30 IST