శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉందా? అయితే ఇలా తగ్గించుకోండి?

ABN , First Publish Date - 2022-02-25T18:09:09+05:30 IST

రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల్లో బ్లాకేజ్‌ ఏర్పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రించేందుకు ఆహారంలో, జీవనశైలిలో మార్పులు చాలా ముఖ్యం. సాల్యుబుల్‌ ఫైబర్‌ లేదా కరిగి పోయే పీచుపదార్థాలు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉందా? అయితే ఇలా తగ్గించుకోండి?

ఆంధ్రజ్యోతి(25-02-2022)

ప్రశ్న: అధిక కొలెస్ట్రాల్‌ ఉందని రక్త పరీక్షల్లో తెలిసింది. ఆహారం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవచ్చా?


- శివయ్య, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల్లో బ్లాకేజ్‌ ఏర్పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రించేందుకు ఆహారంలో, జీవనశైలిలో మార్పులు చాలా ముఖ్యం. సాల్యుబుల్‌ ఫైబర్‌ లేదా కరిగి పోయే పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఓట్స్‌, బార్లీ, నల్లసెనగలు, చిక్కుడు జాతి గింజలు, అలసందలు, రాజ్మా లాంటి గింజలు; బెండ, వంకాయ లాంటి కూరగాయలు; బాదం, ఆక్రోట్‌ లాంటి నట్స్‌, ఆపిల్‌, ద్రాక్ష, నారింజ లాంటి పండ్లను ఏదో ఒక రూపంలో రోజు వారీ ఆహారంలో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు ఉపయోగపడతాయి. అదే విధంగా, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ట్రాన్స్‌ఫాట్స్‌ అధికంగా ఉండే బేకరీ ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌, సాచ్యురేటెట్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉండే మాంసాహారం, వేపుళ్ళు, అన్ని రకాల స్వీట్లు, మొదలైన వాటిని మానెయ్యాలి. తక్కువ నూనెతో వండిన చికెన్‌, చేప లాంటి వాటిని వారానికి ఒకటి రెండు సార్లు తీసుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లతో పాటు రోజూ అరగంట పాటు కనీస వ్యాయామం కూడా చేస్తే మరింత ఉపయోగకరం.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు) 

Updated Date - 2022-02-25T18:09:09+05:30 IST