సీఎం వైఎస్ జగన్ నివాస పరిధిలో హైఅలర్ట్

ABN , First Publish Date - 2021-06-19T03:01:34+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం పరిధిలో

సీఎం వైఎస్ జగన్ నివాస పరిధిలో హైఅలర్ట్

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం పరిధిలో గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు హై అలర్ట్ నిర్వహించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రైతులు, కూలీలు, మహిళలు గత 549 రోజులుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. రేపటితో ఈ ఉద్యమం 550 రోజులకు చేరుకోనుంది. ఈ క్రమంలో రైతులు భారీ ర్యాలీలు, నిరసనలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. రైతుల ర్యాలీలు, నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. సీఎం ఇంటి పరిధిలో నివాసముండే వారు కొత్త వారికి ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ హైఅలర్ట్ నడుమ శనివారం నాడు ఏం జరుగుతుందో...? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2021-06-19T03:01:34+05:30 IST