పంచగ్రామాల భూసమస్యపై దాగుడు మూతలు

ABN , First Publish Date - 2021-07-26T05:59:28+05:30 IST

సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పంచగ్రామాల భూ సమస్యపై అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు దాగుడుమూతలు ఆడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ ఎ.అజశర్మ విమర్శించారు.

పంచగ్రామాల భూసమస్యపై దాగుడు మూతలు
నినాదాలు చేస్తున్న అజ శర్మ, తదితరులు

ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ అజశర్మ 

సింహాచలం, జూలై 25: సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పంచగ్రామాల భూ సమస్యపై అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు దాగుడుమూతలు ఆడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ ఎ.అజశర్మ విమర్శించారు. సమైక్య ప్రజా, రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సింహాచలం ప్రధాన కూడలిలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్య పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కమిటీని వేసి రెండేళ్లు అయిందని, మధ్యలో ముగ్గురు ఎంపీలను అదనంగా సభ్యులుగా చేరుస్తూ జీవోను విడుదల చేసిందని, వీటివల్ల జరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. ఈ సమస్య కోర్టులో ఉన్నందున పరిష్కారానికి నోచుకోవడం లేదని, ప్రకటనల వరకే పరిమితం అవుతున్నారన్నారు. వాస్తవానికి సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందన్నారు. టీడీపీ నేత పాశర్ల ప్రసాద్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వ్యక్తిగత కక్షసాధింపులు మాని భూ సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమైక్య ప్రజా, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వైకే నాయుడు, కార్యదర్శి టీవీ కృష్ణంరాజు, పీవీఎస్‌ఎల్‌ఎన్‌ శాస్త్రి, బి.రమణి, కార్పొరేటర్‌ పిసిని వరాహనరసింహం, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-26T05:59:28+05:30 IST