నిండైన కురుల కోసం..

ABN , First Publish Date - 2020-10-08T17:52:43+05:30 IST

పట్టులా మెరిసే జుట్టు సొంతం కావాలంటే వాటిని తగిన విధంగా సంరక్షించుకోవడం అత్యవసరం. అయితే ముందుగా మీ కురుల స్వభావం, జుట్టు పోషణలో ఏం తగ్గుతున్నాయో తెలుసుకోవడం

నిండైన కురుల కోసం..

ఆంధ్రజ్యోతి(08-10-2020)

పట్టులా మెరిసే జుట్టు సొంతం కావాలంటే వాటిని తగిన విధంగా సంరక్షించుకోవడం అత్యవసరం. అయితే ముందుగా మీ కురుల స్వభావం, జుట్టు పోషణలో ఏం తగ్గుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ఆ తరువాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలో నిర్ణయానికి రావాలి. అన్ని సీజన్‌లలోనూ కురుల అందం తగ్గకుండా మందారం హెయిర్‌ ప్యాక్‌ పనికొస్తుంది..


కావలసినవి

పెరుగు, గుడ్లు, ఆలివ్‌ ఆయిల్‌, మందార పువ్వులు, ఆకులు, తేనె, కొద్దిగా రోజ్‌ మెరీ ఎసెన్షియల్‌ ఆయిల్‌. 


తయారీ

వీటన్నిటిని ఒక గిన్నెలో తీసుకొని పేస్ట్‌ తయారు చేసుకోవాలి. అంతే హెయిర్‌మాస్క్‌ రెడీ.  మొదట జుట్టుకు నూనె రాసుకోవాలి. తరువాత ఈ హెయిర్‌ మాస్క్‌ వేసుకోవాలి. గంట తరువాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. 


లాభాలివి

మందార పువ్వులోని విటమిన్‌ సి, అమినో అమ్లాలు మాడుపై రక్తప్రసరణను పెంచుతాయి. దాంతో వెంట్రుకలు బాగా పెరుగుతాయి. మందార హెయిర్‌ప్యాక్‌ జుట్టుకు కండిషనర్‌లా పనిచేస్తుంది. కురులను మృదువుగా, తళతళలాడేలా చేస్తుంది. జుట్టు మందంగా మారకుండా చేయడంతో పాటు చుండ్రును నివారిస్తుంది.

Updated Date - 2020-10-08T17:52:43+05:30 IST