స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి హెటిరో ఒప్పందం

ABN , First Publish Date - 2020-11-28T06:45:42+05:30 IST

రష్యా వ్యాక్సిన్‌ స్పు త్నిక్‌-వీని తయారు చేయడానికి రష్యా డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎ్‌ఫ)తో హెటిరో ఒప్పందం కుదుర్చుకుంది

స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి హెటిరో ఒప్పందం

ఏడాదికి 10 కోట్ల డోసుల ఉత్పత్తి

2021 ప్రారంభం నుంచి తయారీ!


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రష్యా వ్యాక్సిన్‌ స్పు త్నిక్‌-వీని తయారు చేయడానికి రష్యా డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎ్‌ఫ)తో హెటిరో ఒప్పందం కుదుర్చుకుంది.  హెటిరో బయోఫార్మా ద్వారా ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని హెటిరో లాబ్స్‌ డైరెక్టర్‌ (ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌) మురళీ కృష్ణా రెడ్డి తెలిపారు. ఒప్పందం ప్రకారం ఏడాదికి 10 కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్లలో ప్రపంచంలోనే మొట్టమొదటగా రిజిస్టర్‌ అయిన వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ. 2021 ప్రారంభం నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలని హెటిరో, ఆర్‌డీఐఎ్‌ఫలు భావిస్తున్నాయి. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌పై యూఏఈలోని బెలారస్‌, వెనెజులా, ఇతర దేశాల్లో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి.


భారత్‌లో రెండు, మూడో దశల క్లినికల్‌ పరీక్షలకు అనుమతి లభించింది. భారత్‌లో రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి, వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఆర్‌డీఐఎ్‌ఫతో ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ కోసం 50కి పైగా దేశాల నుంచి 120 కోట్లకు పైగా డోసులకు డిమాండ్‌ వచ్చింది. భారత్‌, బ్రెజిల్‌, చైనా, దక్షిణ కొరియా, ఇతర దేశాల్లోని అంతర్జాతీయ భాగస్వాముల ద్వారా వ్యాక్సిన్‌ను ఆర్‌డీఐఎఫ్‌ ఉత్పత్తి చేయనుంది.  

Updated Date - 2020-11-28T06:45:42+05:30 IST