మెరుపు సమ్మెకూ వెనుకాడం

ABN , First Publish Date - 2021-01-24T07:49:47+05:30 IST

‘‘ఉద్యోగుల ప్రా ణాలను కాపాడుకోవటానికి అవసరమైతే ఎన్నికల విధులను బహిష్కరిస్తాం. మెరుపు సమ్మెకు కూడా వెనుకాడబోము.

మెరుపు సమ్మెకూ వెనుకాడం

ఎన్నికల విధులను బహిష్కరిస్తాం

ఏపీ ఎన్‌జీఓ నేత చంద్రశేఖరరెడ్డి


విజయవాడ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘‘ఉద్యోగుల ప్రా ణాలను కాపాడుకోవటానికి అవసరమైతే ఎన్నికల విధులను బహిష్కరిస్తాం. మెరుపు సమ్మెకు కూడా వెనుకాడబోము. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. ఉద్యోగుల పక్షాన మేమూ ఇంప్లీడ్‌ అయ్యాం. సోమవారం విచారణకు వ స్తోంది. కచ్చితంగా ఉద్యోగుల ప్రాణాల ను కాపాడేదిశగా తీర్పు ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌ చంద్రశేఖరరెడ్డి అన్నారు. శనివారం విజయవాడలో మాట్లాడారు. రెండున్నర సంవత్సరాలుగా ఎన్నికలను జరపకుండా వాయిదా వేసిన కమిషనర్‌ తన పదవీ కాలంలో ఎన్నికలను నిర్వహించాలన్న పట్టుదల, పంతాలను విడనాడి ఉద్యోగుల ప్రాణాలను కాపాడాలన్నారు. ఉద్యోగుల బాగోగులను చూడాల్సిన బాధ్యత  సంఘాల నాయకులుగా తమపై ఉందన్నారు. తమ విజ్ఞప్తి మేరకు సీఎస్‌ రాసిన లేఖనూ కమిషనర్‌ పట్టించుకోలేదన్నా రు. ఉద్యోగుల ప్రాణాలంటే ఎస్‌ఈసీకి చులకనగా ఉందన్నా రు. కరోనాకు భయపడి సాక్షాత్తు కమిషనరే అద్దాల చాటు నుంచి మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారని విమర్శించారు. ఉద్యోగులు మాత్రం ప్రజలతో మమేకమై ఎన్నికల వి ధులు నిర్వహించి ప్రాణాలు కోల్పోవాలా? అని ప్రశ్నించా రు. ఎన్నికల కమిషనర్‌కు ఉన్నట్టే ప్రాణ భయం ఉద్యోగుల కూ ఉండదా? అని నిలదీశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ విజ్ఞప్తిని పట్టించుకోకుండా ముందుకెళ్లడం దారుణమన్నారు. ఎన్నికల నిర్వహణ పేరుతో ఉద్యోగులను వేధింపులకు గురిచేయటం, భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడడం తగదన్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాతే ఉద్యోగులంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-01-24T07:49:47+05:30 IST