డిప్రెషన్‌తో పోరాడుతూనే జీవించాల్సి వచ్చేదంటున్న హీరోయిన్

హీరో, హీరోయిన్ల జీవితాలు అందరూ అద్భుతంగా ఉంటాయనుకుంటారు. కానీ, తెర మీద కనిపించినన్ని రంగులు వారి జీవితాల్లో ఉండవు. వారు అనుభవించే బాధలు ఎవరికీ తెలియవు. అందుకు ఎన్నో ఉదాహరణాలు ఉన్నాయి. గతంలో దీపికా పదుకొణె, మలైకా అరోరా డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో మీడియాకు తెలిపారు. డిప్రెషన్ నుంచి కోలుకోవడం అంత సులభం కాదని వారు చెప్పారు. 


తాజాగా ఒక హీరోయిన్ డిప్రెషన్‌తో మూడేళ్లు పోరాడానని చెప్పింది. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను మీడియాకు వివరించింది. 18ఏళ్ల వయసులో డిప్రెషన్‌కు లోనయ్యానని బనితా సంధు తెలిపింది. డిప్రెషన్ నుంచి బయటపడిన విధానాన్ని ఒక మీడియా ఛానల్‌కు తెలిపింది. ‘‘ నేను 3ఏళ్లు డిప్రెషన్‌తో పోరాడాను. నిజం చెప్పాలంటే దానితో పోరాడుతూ జీవించాల్సి వచ్చేది. కరోనా కంటె కొంచెం ముందు నేను డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. కోవిడ్ రాగానే మళ్లీ డిప్రెషన్ ఆవరిస్తుందా అనే అనుమానం నాకు వచ్చింది. దానికి కూడా సిద్దపడ్డాను. మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సమతుల ఆహారం తీసుకుంటూ మెదడుకు కూడా కొంచెం పని చెప్పాలి. నా చుట్టుపక్కల వారి సహాయంతో నేను డిప్రెషన్ నుంచి బయటపడ్డాను ’’ అని బనితా సంధు చెప్పింది.


‘‘ మహమ్మారి సమయం నాకు సులభంగా గడిచిందని నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్కరూ ఆ సమయంలో కష్టకాలంలో ఉన్నారు. మానసికంగా నా స్నేహితుల కంటె మంచి స్థితిలో నేను ఉన్నాను. జీవితంలో ఏది విలువైనదో ఆ సమయంలోనే నాకు తెలిసి వచ్చింది ’’ అని ఆమె తెలిపింది.


విక్కీ కౌశల్  హీరోగా తెరకెక్కిన సర్దార్ ఉద్దం సినిమాలో బనితా సంధు కీలక పాత్ర పోషించింది. ఆ మూవీకి సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 16న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలైంది. 

Advertisement

Bollywoodమరిన్ని...