Abn logo
Nov 28 2020 @ 20:11PM

ఏడాదికి ఒక సౌత్‌ ఫిల్మ్‌ చేస్తానంటోన్న తాప్సీ

తెలుగు సినిమాలలో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ స్థాయిని అందుకునే దిశగా పయనించిన హీరోయిన్‌ తాప్సీ. ఝుమ్మంది నాదం అంటూ తెలుగు తెరపై మెరిసిన ఈ భామ తర్వాత తెలుగులో మంచి మంచి పాత్రలు చేసింది. తెలుగుతో పాటు, తమిళ్‌లో కూడా బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తాప్సీ అక్కడ బిజీ హీరోయిన్‌గా మంచి మంచి ఆఫర్లతో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో 3 సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక రీసెంట్‌గా తాప్సీ ఒక ఇంటర్వ్యూలో సౌత్‌ ప్రేక్షకుల గురించి చెప్పుకొచ్చింది.


''సౌత్‌ ప్రేక్షకులు నాపై ఎంతగానో ప్రేమ చూపించారు. నేను నటించిన ఎన్నో సినిమాలను వారు ఆదరించారు. ఇప్పటికీ, నేను బాలీవుడ్‌ సినిమాలలో నటిస్తున్నా కూడా నాపై ప్రేమ కురిపిస్తున్నారు. అందుకే వారి కోసం ఏడాదికి ఒక సౌత్‌ ఫిల్మ్‌ చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నాను. తప్పకుండా వారి కోసం ప్రతి సంవత్సరం ఓ సినిమా సౌత్‌లో చేస్తాను..'' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో విజయ్‌ సేతుపతి సరసన ఓ చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే.   

Advertisement
Advertisement
Advertisement