May 11 2021 @ 18:57PM

హీరోయిన్ సునైనాకు కరోనా పాజిటివ్

కోలీవుడ్: ‘కాదలిల్‌ విళుందేన్‌’, ‘మాసిలామణి’ వంటి అనేక చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ సునైనాకు ప్రస్తుతం  కరోనా వైరస్‌ సంక్రమించింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. ‘ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ, నిరంతరం పరిశుభ్రంగా వున్నప్పటికీ.. కరోనా వైరస్‌ సోకింది. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులు మాత్రమే నాతో కాంటాక్ట్‌ అయ్యారు. ఈ కారణంగా వారు కూడా హోం ఐసోలేషన్‌లో వుంటున్నారు. వారికి ఎలాంటి లక్షణాలు లేకున్నప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని భావించాను. కానీ, కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా ట్విటర్‌లో కొన్ని పోస్టులు చేయాల్సి వస్తోంది’ అని సునైనా తెలిపింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వుండాలని, ముఖానికి మాస్క్‌ ధరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది.