Abn logo
Sep 17 2020 @ 00:22AM

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ పాల్గొన్నారు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ పాల్గొన్నారు. ప్రభాస్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆమె, బుధవారం ముంబైలోని ఇంట్లో మొక్కలు నాటారు. మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి, ముందుకు తీసుకు వెళుతున్న సంతోశ్‌కుమార్‌కి శ్రద్ధా కృతజ్ఞతలు తెలియజేశారు.


Advertisement
Advertisement
Advertisement