Abn logo
May 21 2020 @ 20:44PM

ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్ర హీరోయిన్ ఎవరంటే..

Kaakateeya

‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఓ డియర్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ మూవీ తర్వాత ‘మహానటి’ దర్శకుడితో ప్రభాస్ సినిమా చేసేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్ర్కిఫ్ట్ సిద్ధం చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ సరసన నటించే హీరోయిన్‌ని సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునెని నటింపజేయాలని భావించిన చిత్ర టీమ్.. ఆమె బిజీగా ఉండటంతో బాలీవుడ్‌కు చెందిన మరో భామను సెలక్ట్ చేసినట్లుగా తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.


ఇంతకీ ఆ బాలీవుడ్ హీరోయిన్‌కు చెందిన మరో భామ ఎవరనుకుంటున్నారు? టాలీవుడ్‌లోకి ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తో ఎంట్రీ ఇస్తున్న అలియా భట్. అవును అలియా భట్‌తో నాగ్ అశ్విన్ చర్చలు జరిపారని, ప్రభాస్‌తో చేసేందుకు ఆమె కూడా సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. అంతేకాదు లాక్‌డౌన్ ముగిసిన తర్వాత నాగ్ అశ్విన్ ముంబై వెళ్లి ఆమెకు కథ వినిపించనున్నారని కూడా అంటున్నారు. మరి ఈ వార్తపై నాగ్ అశ్విన్ లేదంటే వైజయంతీ మూవీస్ అధినేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం. 

Advertisement
Advertisement