Abn logo
May 8 2020 @ 16:58PM

వారి కంటే నేనేం తక్కువ కాదంటున్న సాయిపల్లవి

‘ప్రేమమ్’ మూవీతో సౌత్‌లో తిరుగులేని స్టార్ డమ్ దక్కించుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తర్వాత కాలంలో ఈ భామ తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసింది. అందంతో పాటు, అభినయంలో కూడా ఆకట్టుకోగల సామర్థ్యం సాయిపల్లవి సొంతం. అందుకే సౌత్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందీ హైబ్రీడ్ పిల్ల. అయితే ఈ మధ్య కాలంలో విజయాలను అందుకోవడంతో సాయిపల్లవి వెనుకబడింది.


సక్సెస్‌లో లేని స్టార్స్ పారితోషికం తగ్గించుకునైనా అవకాశం అందుకోవాలని చూస్తారు. అయితే సాయిపల్లవి మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తుందట. అందుకేనేమో తన పారితోషికాన్ని ఏకంగా రూ. 1.4 కోట్లకు పెంచేసిందనే వార్తలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. సాయిపల్లవి డిమాండ్ చేస్తున్న ఈ రెమ్యూనరేషన్ సమంత, అనుష్క, కాజల్ వంటి టాప్ హీరోయిన్లు తీసుకునే అమౌంట్‌తో సమానం. ఆ టాప్ హీరోయిన్‌లకు నేనేం తక్కువ కాదనే విధంగా సాయిపల్లవి డిమాండ్ చేస్తుందట. మీడియం రేంజ్ చిత్రాలకు ఈ రౌడీబేబీని హీరోయిన్‌గా తీసుకునే నిర్మాతలకు ఓ రకంగా ఇది చేదు వార్తే. మరి ఆమె రెమ్యూనరేషన్ విషయంలో వినబడే వార్తల్లో ఎంత నిజం ఉందో సాయిపల్లవే చెప్పాలి.

Advertisement
Advertisement
Advertisement