పక్క ఫొటోలోని ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? ఎవరో పాత తరం బాలీవుడ్ హీరోయిన్ అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. తమిళనాడులో పుట్టి తెలుగులో బోలెడన్ని సినిమాలు చేసిన ఈమె మరెవరో కాదు.. రెజీనా కసాండ్రా.
ఇటీవలె `ఎవరు` వంటి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రెజీనా.. మెగాస్టార్ `ఆచార్య`లో ఐటెం సాంగ్ కూడా చేయబోతోంది. తాజాగా సోషల్ మీడియాలో రెజీనా ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. రెట్రో లుక్‌లో రెజీనాను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. పాత కాలపు ఫారిన్ భామల తరహాలో మేకోవర్ సాధించిన రెజీనా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది గుర్తు పట్టలేకపోయారు. ఈ ఫొటోపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు.