హీరోయిన్ ప్రణీత ఈ కరోనా లాక్డౌన్లో తన గొప్పమనసును చాటుకున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి ఆమె ఈ లాక్డౌన్లో సహాయం అందించి, అందరి మన్ననలు అందుకుంది. ఈ లాక్డౌన్ సోనూసూద్ పేరు ఎలా అయితే వినిపించిందో.. కాస్త అటుఇటుగా ప్రణీత పేరు కూడా వినిపించింది. ఇక ఇటీవల ఆమె మాల్దీవుల టూర్ ముగించుకుంది. అయితే ఆమె తను టూర్ వెళ్లే ప్రతిసారి, అలాగే టూర్ నుంచి వచ్చిన ప్రతిసారి కరోనా టెస్ట్‌లు చేయించుకున్నట్లుగా తెలుపుతూ.. ఇన్‌స్టాగ్రమ్‌లో కరోనా టెస్ట్ చేయించుకుంటున్న వీడియోని షేర్ చేసింది. ''గత కొన్ని నెలలుగా ఎన్నో సార్లు కరోనా టెస్ట్‌లు చేయించుకున్నాను. టూర్‌కి ముందు, అలాగే టూర్ నుంచి వచ్చిన తర్వాత టెస్ట్‌లు చేయించుకుంటున్నాను. అయితే కరోనా టెస్ట్ చేయించుకున్న ప్రతిసారి ఇటువంటి అసౌకర్యానికి గురవుతూనే ఉన్నాను.." అని ప్రణీత తన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపింది.