May 7 2021 @ 12:54PM

కొవిడ్ బాధితులకు అండగా హీరోయిన్ ప్రణీత

కొవిడ్ బాధితులకు అండగా టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత నిలిచారు. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఉధృతి విపరీతంగా ఉండటంతో సినీ తారలు తమవంతు సహాయాన్ని అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. గత ఏడాది కూడా ప్రణీత కరోనాను లెక్క చేయకుండా బయటకొచ్చి సేవలందించింది. మరోసారి తన ఛారిటీ కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఈ సారి మరింతగా తన సేవా కార్యక్రమాలను విస్తరించి ఆక్సిజన్ సిలిండర్లు అందచేస్తోంది. ఫస్ట్ వేవ్‌లో కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చిన ప్రణీత అవసరమైన వాళ్లందరికీ ఆహారం అందచేసింది. ఇప్పుడు ఆహారం కంటే ఆక్సిజన్ ఎంతో అవసరం కాబట్టి తన ఛారిటీ ద్వారా అవసరమైన వాళ్లకు ఆక్సిజన్ అందిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు సెలబ్రిటీలంతా తమకు తోచిన విధంగా సమాజానికి సహాయపడాలని కోరింది.