Abn logo
Mar 2 2021 @ 17:10PM

నిర్మాతకు రివార్డులు, మాకు అవార్డులు తెచ్చే చిత్రమిది: పూర్ణ

హీరోయిన్‌ పూర్ణ ప్రధాన పాత్రలో.. ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్నచిత్రం 'బ్యాక్‌ డోర్‌'. 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కోన వెంకట్, వీర శంకర్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.


విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్ర టీజర్ చాలా బాగుందని, దర్శకుడు బాలాజీ ప్రతిభ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించిందని, ఇప్పటికే నంది అవార్డు గెలుచుకున్న బాలాజీ 'బ్యాక్ డోర్'తో మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని, పూర్ణ కెరీర్‌లో మరో మంచి హిట్ ఫిల్మ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని హాజరైన అతిధులందరూ ఆకాంక్షించారు. కాగా, తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, రష్ చూసి ఇంప్రెస్ అయి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్న చిత్ర సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్‌లతోపాటు.. సినిమా అద్భుతంగా వచ్చేందుకు సహకరించిన హీరోయిన్ పూర్ణ, హీరో తేజలకు కర్రి బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ పూర్ణ మాట్లాడుతూ.. ''నా కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ ఫిల్మ్‌గా ఈ 'బ్యాక్ డోర్' చిత్రం నిలిచిపోతుంది. దర్శకుడు బాలాజీ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాతలకు రివార్డులు, మాకు మంచి అవార్డులు తెచ్చే చిత్రమిదని నేను నమ్ముతున్నాను. టీజర్‌ ఆవిష్కరించి, చిత్రయూనిట్‌ని అభినందించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. త్వరలోనే మీ ముందుకు వస్తాము.." అని తెలుపగా.. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు, నటనలో తనకు ఎన్నో సూచనలిచ్చిన పూర్ణకు చిత్ర కథానాయకుడు తేజ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement