Sep 28 2021 @ 20:34PM

మీ జెండాలకు వేల వేల దండాలయా: పూనమ్ కౌర్ ట్వీట్స్ వైరల్

దర్శకరత్న, దివంగత దాసరి నారాయణరావుని తలుచుకుంటూ హీరోయిన్ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి ట్వీట్‌లో ఆమె దాసరి నారాయణరావు నటించిన ‘రౌడీ దర్బార్’ చిత్రంలోని ‘‘ఇంద్రలోకం పార్టీ.. చంద్రలోకం పార్టీ.. మీ జెండాలకు వేల వేల దండాలయా.. మీ పార్టీల్లో గూండాలను చేర్చకండయా..’’ అనే వీడియో సాంగ్‌ని పోస్ట్ చేసి.. దయచేసి ఈ పాటను వినండి అని కోరింది.


మరో ట్వీట్‌లో.. ‘‘చిత్ర పరిశ్రమలో ఏకైక గురువు దాసరిగారు. ఆయన నాకు తండ్రిలాంటి వారు. ఆయనను చాలా మిస్సవుతున్నాను. ఈరోజు దాసరిగారికి నేనొక సందేశాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. భగవంతుడు దానిని ఆయనకు చేరవేస్తాడని ఆశిస్తున్నాను..’’ అంటూ పేర్కొంది. అయితే ఈ ట్వీట్స్ వెనుక ఆమె ఉద్దేశ్యం ఏమై ఉంటుందా? అని, అలాగే ప్రత్యేకంగా గురు అనే పదానికి ఆమె హ్యాష్ ట్యాగ్ ఇవ్వడం కూడా సోషల్ మీడియాలో ఇప్పుడనేక చర్చలకు తావిస్తోంది.