Abn logo
Mar 5 2021 @ 19:42PM

అఫీషియల్‌: ఇస్మార్ట్ హీరో సరసన బేబమ్మే

'ఉప్పెన' చిత్రంతో భారీ క్రేజ్‌ సొంతం చేసుకున్న బేబమ్మ.. కృతిశెట్టికి ఇప్పుడు వరుస ఆఫర్లు పలకరిస్తున్నాయి. ఇప్పటికే ఆమె టాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలను సైన్‌ చేసి బిజీ తారగా పేరు పొందుతుంది. తాజాగా ఆమె అకౌంట్‌లోకి మరో చిత్రం వచ్చి చేరింది. వ‌రుస విజ‌యాల‌తో క్రేజీ హీరోగా దూసుకెళ్తున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా.. ఆవారా, పందెంకోడి వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా  తెలుగు, త‌మిళ భాష‌ల్లో శ్రీ‌నివాసా చిట్టూరి నిర్మాత‌గా ఓ ఊర మాస్  చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో రామ్ స‌ర‌స‌న లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.

రామ్ పోతినేని కెరీర్‌లో 19వ మూవీగా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ చిత్రం రూపొందుతోంది. స్టైలిష్ ఎలిమెంట్స్‌తో అవుట్-అండ్-అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్‌గా లింగుసామి ట్రేడ్‌మార్క్‌తో అల్ట్రా మాస్ చిత్రంగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ హీరో సరసన కృతి శెట్టి హీరోయిన్‌ అనగానే.. ఆమె అదృష్టానికి అంతా అబ్బురపడిపోతున్నారు. ఇక ఈ చిత్రంలో న‌టించే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement