టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) నటిస్తున్న సీక్వెల్ మూవీ 'కార్తికేయ 2' (Kathikeya 2). అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran) ఈ సినిమాలో సిద్ధార్థ సరసన హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) భారీ స్థాయిలో తెరకెక్కించాడు. గతంలో చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్లో వచ్చిన థ్రిల్లర్ మూవీ కార్తికేయకు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ వచ్చి అన్నీ వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అయితే, ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్‌ను తాజాగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రాం ఖాతాలో తెలిపింది. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ - పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ జూలై 22న రిలీజ్ చేయబోతున్నారు.
కాగా, గతకొంతకాలంగా ఫాంలోలేని అనుపమ పరమేశ్వరన్ ఇటీవల వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాతో మంచి హిట్ అందుకొని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ప్రస్తుతం రెండు సినిమాలు వరుసగా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వాటిలో ఒకటి కార్తికేయ 2 కాగా, మరొక సినిమా 18 పేజెస్. ఈ సినిమాకు కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలలో హీరో నిఖిల్ కావడం విశేష. ఇక ఈ రెండు చిత్రాలు హిట్ అయితేమాత్రం మళ్ళీ అనుపమ పరమేశ్వరన్ కొంతకాలం సత్తా చాటడం గ్యారెంటీ అంటున్నారు.