Jun 18 2021 @ 16:00PM

1 మిలియన్‌ ప్లస్‌కి చేరుకున్న అంజలి

తెలుగు, తమిళ చిత్రసీమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్‌ అంజలి. తెలుగులో సరైన అవకాశాలు రానప్పటికీ.. తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌కు చేరుకుంది అంజలి. కోలీవుడ్‌లో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ... ఆ చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈమె ‘కాట్రు తమిళ్‌’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌ వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘అంగాడి తెరు’, ‘ఎంగేయుం ఎప్పోదుమ్‌’, ‘కలకలప్పు’, ‘ఇరైవి’, ‘పేరన్బు’ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల్లో అంజలి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో ఆమె 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బలుపు', 'మసాలా', 'గీతాంజలి', 'డిక్టేటర్‌', 'చిత్రాంగద' వంటి చిత్రాల్లో నటించింది. ఆమె సినీ కెరీర్‌ పీక్‌ స్థాయికి చేరుకుంటుందన్న దశలో ప్రేమ సమస్యలో చిక్కుకుంది. దీంతో ఆమె గత కొన్ని నెలలుగా వెండితెరకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో అనుష్క మెయిన్‌ లీడ్‌లో నటించిన 'నిశ్శబ్దం' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన అంజలికి.. రీసెంట్‌గా పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రం ద్వారా మంచి బ్రేక్‌ లభించింది. అదే సమయంలో ఆమె సోషల్‌ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటోంది. దీంతో ఆమె ఫాలోయర్స్‌ సంఖ్య ఒక మిలియన్‌ మార్క్‌ను బీట్ చేసింది. అంతే కాదు ప్రస్తుతం ఆమె 2 మిలియన్‌ మార్క్‌కు అతి చేరువలో ఉంది. 


టాప్‌ హీరోల సరసన నటించిన అంజలి... అందరి హీరోల ఫ్యాన్స్‌కు పరిచయమే. ఆ కారణంగానే ఆమెకు సోషల్‌ మీడియాలో ఫాలోయర్స్‌ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం అంజలికి ట్విట్టర్‌ ఫాలోయర్ల సంఖ్య ఒక మిలియన్‌ బీట్‌ చేయగా.. సమంతకు 8.8 మిలియన్లు, శృతి హాసన్‌కు 7.8 మిలియన్లు, త్రిషకు 5.3 మిలియన్లు, తమన్నాకు 5 మిలియన్లు, హన్సికాకు 5 మిలియన్లు, కాజల్‌ అగర్వాల్‌కు 4.8 మిలియన్లు, కీర్తి సురేష్‌కు 3.9 మిలియన్లు, ఐశ్వర్యా రాజే‌ష్‌కు 2.1 మిలియన్లు, అమలాపాల్‌కు 2.1 మిలియన్లు, సాయి పల్లవికి 1.9 మిలియన్లు, రాయ్‌లక్ష్మికి 1.8 మిలియన్లు, రాశిఖన్నాకు 1.3 మిలియన్ల చొప్పున ఫాలోయర్స్‌ ఉన్నారు.