Abn logo
Apr 3 2020 @ 22:30PM

నాది లవ్ ఫెయిల్యూర్ కాదు: అంజలి

తెలుగమ్మాయ్ అంజలి గురించి ఈ మధ్య అనేక రూమర్లు వినిపించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కోలీవుడ్ హీరో జై‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉందని, అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారనే వార్తలు బాగా వినిపించాయి. ఈ లవ్ ఫెయిల్యూర్ గురించి అంజలి వద్ద ప్రస్తావించగా..


‘‘నాది లవ్‌ ఫెయిల్యూర్‌ కాదు. అసలు నేను ప్రేమలో లేను. జై నాకు మంచి ఫ్రెండ్‌ మాత్రమే! తనూ నేను ప్రేమలో ఉన్నట్టు కానీ, పెళ్ళి చేసుకోవాలని అనుకున్నట్టు కానీ ఎక్కడా ఎవరితోనూ చెప్పలేదు. మా మధ్య ఏదో ఉందనీ, మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామనీ, ఇప్పుడు విడిపోయామనీ ఇవన్నీ ఊహాగానాలే తప్ప వాస్తవాలు కావు. అయినా ఒక హీరోతో కలిసి రెండు మూడు సినిమాలు చేసినంత మాత్రాన ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టేనా? మా మధ్య స్నేహం చూసి కోలీవుడ్‌లోని మీరనుకుంటున్న నిర్మాత అలా అనుకుని ఉండొచ్చు. అది ఆయన అభిప్రాయం కావొచ్చు. దాన్ని నేను ఖండించను, సమర్ధించను. ఎవరేమనుకున్నా మా మధ్య స్నేహం తప్ప మరొకటి లేదు. ఇంకా మీకు అనుమానాలు ఉంటే మీ ఇష్టం నేనేమీ చేయలేను..’’ అని తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement