నేడు పెద్దచెరుకూరుకు సినీనటి పాయల్‌ రాక

ABN , First Publish Date - 2020-11-30T05:48:16+05:30 IST

ప్రముఖ సినీనటి పాయల్‌ రాజ్‌పుత్‌ సోమవారం సాయంత్రం నెల్లూరు రూరల్‌ ప్రాంతం పెద్దచెరుకూరుకు రానున్నారు.

నేడు పెద్దచెరుకూరుకు సినీనటి పాయల్‌ రాక

నెల్లూరు రూరల్‌, నవంబరు 29 : ప్రముఖ సినీనటి పాయల్‌ రాజ్‌పుత్‌ సోమవారం సాయంత్రం నెల్లూరు రూరల్‌ ప్రాంతం పెద్దచెరుకూరుకు రానున్నారు. అక్కడి గంగా బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర ఆలయంలో జరిగే కార్తీక మాస పూజల్లో ఆమె పాల్గొంటారని ఆలయ కమిటీ తెలిపింది. ఆ దేవస్థానంలో వైభవంగా జరిగే కార్తీక ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పొరుగు ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హజరవుతుంటారని కమిటీ పేర్కొంది.

Updated Date - 2020-11-30T05:48:16+05:30 IST