Apr 12 2021 @ 18:27PM

ప్రైవేటు టీచర్లను ఆదుకోవడం అద్భుతం: మంచు విష్ణు

హైదరాబాద్: కరోనా కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రేవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని రాష్ట్రం ప్రభుత్వం ఆదుకోవడం నిజంగా అద్భుతమని ప్రముఖ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు విష్ణు కొనియాడతూ తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ప్రైవేటు టీచర్లకు రూ.2 వేల నగదు, 25 కిలోల బియ్యాన్ని ఇవ్వడం ఓ అద్భుతమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రైవేట్ ఉపాధ్యాయులలో కేసీఆర్‌పై మరెంతో గౌరవం పెరిగిందని ఆయన అన్నారు.