Hero Teacher From Bihar: ఒక రూపాయికే పాఠాలు చెపుతున్న హీరో టీచర్..

ABN , First Publish Date - 2022-08-30T22:02:04+05:30 IST

గురువు, ధైవం అన్నారు పెద్దలు. చదువులు నేర్పే గురువే మనకు ప్రత్యక్ష ధైవం. తన చేతిలో అక్షరాలు దిద్దిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిసి ఆనందిస్తాడు.

Hero Teacher From Bihar: ఒక రూపాయికే పాఠాలు చెపుతున్న హీరో టీచర్..

గురువు, ధైవం అన్నారు పెద్దలు. చదువులు నేర్పే గురువే మనకు ప్రత్యక్ష ధైవం. తన చేతిలో అక్షరాలు దిద్దిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిసి ఆనందిస్తాడు. చదువు జీవితాన్ని వెలిగిస్తుంది. మరి జీవితాన్ని వెలిగించేది ఉపాధ్యాయుడే.. వృత్తి ధర్మం అని సరిపెట్టుకునే తత్వం ఉపాధ్యాయుడికి సరిపడదేమో..  ఇదిగో అలాంటి ఉపాధ్యాయుడిని గురించి తెలుసుకుందాం.


సమస్తిపూర్, బీహార్ కు చెందిన ఈ పంతులుగారు మాత్రం తన విద్యార్థులకు పాఠాలు చెప్పడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అరవై ఒక్కేళ్ళ లోకేష్ శరణ్ తన బ్యాగ్ లో సుద్దలు, డస్టర్, కొన్ని పెన్నులు వేసుకుని ఎక్కడికి వెళ్ళినా పిల్లలకు పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. తన తండ్రి ప్రారంభించిన పాఠశాలలో వందలాది మంది విద్యార్థులను తయారు చేసాడు ఆయన. అయితే ఇది 2013లో మూతపడింది. 


అయితే లోకేష్ తన ఇంటి వరండాలో పిల్లలకు పాఠాలు నేర్పించాలని, సమర్థులైన విద్యార్థులను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా పుట్టిన ఆలోచనే ఒక రూపాయికి భోదించే పద్దతి. ఇలా ఎందరో విద్యార్థలు ఆయన చేతుల్లో తయారయ్యారు. 


సీతామర్హికి చెందిన లోకేష్ 1986లో బీఎ పూర్తి చేసి 1988లో బి.ఇడి చేసి సమస్తిపూర్ లోని కియోంటా గ్రామానికి మారాడు. అతని తండ్రి ఉపాధ్యాయుడిగా బాల్ సైనిక్ విద్యాలయంలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసాడు. ఆయన 1983లో ప్రత్యేకమైన పాఠశాలను ప్రారంభించారు. 


హోలిస్టిక్ లెర్నింగ్..

తండ్రి ఏర్పాటు చేసిన పాఠశాల కోవిడ్ తరువాత మూతపడింది. అయితే చాలా మంది పిల్లలు బెంచీలు లేక చెట్లకింద కూర్చునేవారు. అలా కూర్చున్నవాళ్ళకు బెంచీలను ఏర్పాటు చేసారు లోకేష్. వాకిలిని తాత్కాలిక తరగతి గదిగా మార్చారు. బ్లాక్ బోర్డ్ కు పెయింట్ ను వేసాడు. అందులో 40 మంది పిల్లలు చదువుకోగలరని అతని అంచనా..


అయితే ఇలా ఉచితంగా చదువు చెప్పడం అంటే పిల్లలు రాకపోవచ్చని అనిపించింది. తరవాత ప్రతి విద్యార్థి నుంచి రూపాయి చప్పున వసూలు చేయాలనే ఆలోచన వచ్చింది. ఇలా చేస్తే ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులకి మధ్య జవాబుదారీతనం ఏర్పడుతుందని లోకేశ్ నమ్మకం. 


కియోంటా, సీతామర్హిలో లోకేష్ ఈ సెటప్‌ను ఏర్పాటు చేశారు. పిల్లల్లో కలిగే సందేహాలను నివృత్తి చేయడం, బోధించడం, చిరిగిన పుస్తకాలను బైండింగ్ చేయడం, కుట్టడం వంటివే కాకుండా, విద్యార్థుల చేతివ్రాతను మెరుగుపరచడం, పాఠ్యేతర కార్యకలాపాలను ప్రోత్సహించడం చేసేవారు. 


ఉపాధ్యాయులు సబ్జెక్టులపై దృష్టి సారిస్తారు, అయితే రైటింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇతర అంశాలను మెరుగుపర్చడం వల్ల అదనపు మార్కులు పొందవచ్చు అనేది లోకేష్ అభిప్రాయం. 


లోకేష్ ఇతర ప్రాంతానికి వెళ్లినా విద్యార్థులకు పాఠాలను బోధిస్తారు. లోకేష్ పాఠం చెప్పే విధానం చూసి బలరామ్‌పూర్‌లోని డివిజనల్ అధికారి ఆయన్ను 86 మంది ఉపాధ్యాయులకు వినూత్నమైన, ఆసక్తికరమైన పద్ధతులలో శిక్షణ ఇవ్వాలని కోరాడు. పాఠశాల విద్యార్థులతో పాటు, సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు కూడా లోకేష్ మార్గదర్శకత్వం నిలుస్తున్నారు. 

Updated Date - 2022-08-30T22:02:04+05:30 IST