Jun 15 2021 @ 17:36PM

సూర్య పాన్ ఇండియా మూవీ.. ద‌ర్శ‌కుడెవ‌రంటే?

మ‌న టాలీవుడ్ హీరోలు క్ర‌మంగా పాన్ ఇండియా సినిమాలను రూపొందించే ప‌నిలో బిజీగా ఉంటే, కోలీవుడ్ స్టార్స్ మ‌న టాలీవుడ్ మార్కెట్‌పై ప‌ట్టు సాధించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మ‌న తెలుగు నిర్మాత‌లతో క‌లిసి సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. ఇప్ప‌టికే కోలీవుడ్ నుంచి తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులైన ధ‌నుశ్‌, విజ‌య్‌లు స్ట్ర‌యిట్ తెలుగు సినిమా ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డానికి రెడీ అయ్యారు. వీరి బాట‌లో మ‌రో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా అడుగుపెట్టాడు. ఈ హీరో ఇప్ప‌టికే త‌న త‌మిళ సినిమాల‌ను తెలుగులోకి అనువాదం చేసి స‌మాంతరంగా విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా స్ట్ర‌యిట్ తెలుగు సినిమాను చేయ‌బోతున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. ఇప్ప‌టికే విజ‌య్‌తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న నిర్మాత దిల్‌రాజు ఇప్పుడు సూర్య‌తోనూ ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. మాస్ డైరెక్ట‌ర్‌గా పేరున్న బోయ‌పాటి ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మ‌రింత క్లారిటీ రానుందని టాక్ హల్ చల్ చేస్తోంది.