హీరో సూర్య తండ్రి శివకుమార్‌పై కేసు

ABN , First Publish Date - 2020-06-07T09:31:52+05:30 IST

తమిళ నటుడు, హీరో సూర్య తండ్రి శివకుమార్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వీడియోలో టీటీడీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ తమిళ్‌మయ్యన్‌ అనే భక్తుడు

హీరో సూర్య తండ్రి శివకుమార్‌పై కేసు

  • టీటీడీపై తప్పుడు ప్రచారమంటూ పలువురిపైనా కేసుల నమోదు


తిరుమల, జూన్‌ 6: తమిళ నటుడు, హీరో సూర్య తండ్రి శివకుమార్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వీడియోలో టీటీడీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ తమిళ్‌మయ్యన్‌ అనే భక్తుడు ఈ-మెయిల్‌ ద్వారా టీటీడీకి ఫిర్యాదు చేశా రు. తిరుమలలో ఆసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, భక్తులు తిరుమలకు వెళ్లకూడదని శివకుమార్‌ సూచించాడని తమిళ్‌మయ్యన్‌  పేర్కొ న్నట్టు టీటీడీ తెలిపింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన శివకుమార్‌పై టీటీడీ చేసిన ఫిర్యాదు మేరకు తిరుమల 2 టౌన్‌ పోలీసులు ఏప్రిల్‌ 29న కేసు నమోదు చేశారు. పేదవాళ్లకు తిరుమలలో సరిగా దర్శ నం కల్పించకుండా తోసేస్తున్నారని, ధనవంతులకు మాత్రం సకల మర్యాదలతో దర్శనం చేయిస్తున్నారనే భావ న కలిగేలా అసభ్య పదజాలం ఈ వీడియాలో శివకుమార్‌ మాట్లాడినట్టు ఉందని డీఎస్పీ ప్రభాకర బాబు తెలిపారు. టీటీడీపై దుష్ప్రచారం చేశారంటూ మరికొందరిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated Date - 2020-06-07T09:31:52+05:30 IST