Chitrajyothy Logo
Advertisement

నరేష్ ఆరోపణలపై సీరియస్.. అమ్మవారిపై ఒట్టేసిన శ్రీకాంత్

twitter-iconwatsapp-iconfb-icon
నరేష్ ఆరోపణలపై సీరియస్.. అమ్మవారిపై ఒట్టేసిన శ్రీకాంత్

ప్రత్యర్థి ప్యానలైన ప్రకాశ్ రాజ్ ప్యానల్ మూడు, నాలుగు సెంటర్లలో డబ్బులు పంచుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని మంచు విష్ణుకి ఓటు వేయండి అంటూ సీనియర్ నటుడు నరేష్ కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన హీరో శ్రీకాంత్ సీరియస్ అయ్యారు. వాళ్లే డబ్బులు ఇవ్వడానికి మనుషుల్ని పెట్టి.. ప్రకాశ్ రాజ్‌ ఇస్తున్నాడని చెప్పించేలా చేయడానికి ప్లాన్ చేశారని, మెంబర్స్ అందరూ ఇది గమనించాలని శ్రీకాంత్ కోరారు. ఇటువంటి కల్చర్‌లెస్ పనులు చేయాల్సిన అవసరం మాకు లేదని.. అమ్మవారిపై ఒట్టేసి చెప్పిన శ్రీకాంత్, ఆరోపణలు చేసిన నరేష్‌కు ఇంతటితో ఆపేయమని వార్నింగ్ ఇచ్చారు. 


శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడే నరేష్‌గారి వీడియో చూశా. నరేష్ గారూ.. ఎందుకండీ ఇంకా అబద్దాలు ఆడతారు. మేము డబ్బులు పంచుతున్నామా? మూడు మూడు సెంటర్లలో డబ్బులు పంచుతున్నామా? మీరు డబ్బులు వేరే వాళ్లతో పంపించి.. ప్రకాశ్ రాజ్ డబ్బులు ఇస్తాడు అని చెప్పదలుచుకున్నారా? ఆపేయండి సార్.. ఇక్కడితో ఆపేయండి. ఇంకా ఎక్స్‌ట్రాలు ఏమీ మాట్లాడవద్దు. దయచేసి మెంబర్స్ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. నరేష్ గారు ఈ రోజు ఎంత తప్పుడు మాట మాట్లాడుతున్నాడంటే.. వాళ్లు చేసే పని మా మీద రుద్దడానికి ట్రై చేస్తున్నాడు. దయచేసి.. మెంబర్స్ అందరూ అర్థం చేసుకోండి. మా లైఫ్‌లో అటువంటి కల్చర్‌లెస్ పనులు చేయం. దసరా సందర్భంగా పూజలందుకుంటున్న అమ్మవారి మీద ఒట్టేసి చెబుతున్నాం. అలాంటి కల్చర్‌లెస్ పనులు మేము చేయం. ఏమైనా తేడా వస్తే.. ఆ అమ్మవారే మమ్మల్ని నాశనం చేస్తారు. మెంబర్స్‌కి ఒకటే చెబుతున్నాం. ఇటువంటివి నమ్మవద్దు. మేము మందు పార్టీలు ఇవ్వలేదు. డబ్బులు పంచలేదు.. ఏమనుకుంటున్నారు నరేష్ మీరు? మా మీద బురద జల్లాలని అనుకుంటున్నారా? ఇంకా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని నాశనం చేయడానికే ఉన్నారా? మీరంతా. ఆలోచించుకోండి.. మైండ్ కొంచెం పెట్టండి. ఏం మాట్లాడుతున్నారు మీరు. రేపు ఎలక్షన్స్ అనగా ఈ రోజు డబ్బులు పంచుతున్నామని పెడతారా? డబ్బులు పంచింది మీరు. ఇంకా బురద జల్లాలని చూస్తున్నారా? లాస్ట్ టైమ్ ఇదే చేశారుగా. అసోషియేషన్ డబ్బులు మొత్తం పోయాయ్. మెంబర్స్‌ని నమ్మించాలని ఇలాంటి పనులు చేస్తున్నారా? అంటే దీనిని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే.. ఎవరి ద్వారానో మీరు డబ్బులు పంచేలా చేసి.. ఓ మాకు ప్రకాశ్ రాజ్ పంపించాడు అని చెప్పడానికా? మీరు చేసేది. ముందస్తు రాజకీయమా ఇది? ప్లీజ్.. మెంబర్స్ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను.. ఇటువంటి ప్రలోభాలకు లొంగవద్దని నేను ఎప్పుడో చెప్పాను. ఇటువంటివి చాలా జరుగుతాయి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి..’’ అని అన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement