‘మానాడు’ మూడ్‌లో మరో చిత్రాన్ని ఓకే చేసిన శింబు

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపుదిద్దుకుని విడుదలైన ‘మానాడు’ చిత్రం ఘన విజయంతో హీరో శింబు ఖుషీగా ఉన్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత శింబు విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం ఇచ్చిన సంతోషంతో పలు దర్శకులు చెప్పే కథలను అలకిస్తున్నారు. తాజాగా దర్శకుడు రామ్‌ చెప్పిన కథ శింబుకు నచ్చడంతో ఒకే చెప్పినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సమయం పట్టనుంది. 


ప్రస్తుతం శింబు ‘కొరోనా కుమార్‌’, ‘పత్తు తల’ వంటి చిత్రాలు చేస్తున్నాడు. వీటిని పూర్తి చేసిన తర్వాతే దర్శకుడు రామ్‌ చిత్రంలో నటించనున్నారు. అలాగే, ప్రస్తుతం రామ్‌ చేపట్టిన తమిళ, మలయాళం ద్విభాషా చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఈ చిత్రం షూటింగ్‌ ఇపుడు ధనుష్కోటిలో శరవేగంగా జరుపుకుంటుంది.

Advertisement