Abn logo
Oct 30 2020 @ 22:21PM

8 సంవత్సరాల తర్వాత.. ఆనందంగా ఉంది: సిద్దార్థ్‌

Kaakateeya

బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు హీరో సిద్ధార్థ్‌. తెలుగులో ఆయనకి మంచి మంచి సినిమాలు ఉన్నప్పటికీ.. గత కొంత కాలంగా డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడం లేదు. ఆయన తమిళ్‌లో చేసిన కొన్ని చిత్రాలు డబ్బింగ్‌ రూపంలో విడుదలవ్వడం తప్ప.. సిద్దార్థ్‌ నుంచి స్ట్రయిట్‌ చిత్రం వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అయింది. ఇదే విషయం తెలుపుతూ తాజాగా సిద్ధార్థ్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కించబోతోన్న చిత్రంలో హీరోగా సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. హీరో శర్వానంద్‌, సిద్దార్థ్‌లు ఈ చిత్రంలో హీరోలు. ఈ చిత్రంతో మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉందని సిద్దార్థ్‌ తెలిపాడు.


''8 సంవత్సరాల తర్వాత మళ్లీ టాలీవుడ్‌ చిత్రం మహాసముద్రంలో నటిస్తున్నాను. ఈ చిత్ర షూటింగ్‌ నవంబర్‌లో మొదలవుతోంది. ఈ సినిమాతో మళ్లీ నేను తెలుగులో బిజీ అవుతానని ఆశిస్తున్నాను. గొప్ప టీమ్‌తో వర్క్‌ చేసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులు కావాలి.." అని సిద్దార్థ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 


Advertisement
Advertisement