Abn logo
Oct 1 2020 @ 21:33PM

అలాంటి నెగిటివ్‌ పాత్రలు చేయాలని ఉంది: రాజ్‌ తరుణ్‌

Kaakateeya

'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోగా ప‌రిచయమై మొద‌టి సినిమాతోనే తన నటనతో మంచి పేరును సంపాదించుకున్నారు యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌. ఆయన తాజాగా నటించిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా..'. విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మించారు. అక్టోబ‌ర్1 సాయంత్రం 6గంట‌ల‌కి ఓటీటీలో ఈ చిత్రం విడుదలైంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రాజ్‌ తరుణ్‌ మీడియాతో ముచ్చటించారు. చిత్ర విశేషాలతో పాటు తనకి ఎటువంటి పాత్రలు చేయాలని ఉందో కూడా తెలిపారు.

ఆయన మాట్లాడుతూ..  ''ప్ర‌‌స్తుతం విజ‌‌య్ కుమార్‌గారితోనే మ‌రో సినిమా చేస్తున్నాను. అలాగే శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా, సంతోష్ అని నూత‌న ద‌ర్శ‌కుడితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇంకా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో డ్రీమ్ గ‌ర్ల్ రీమేక్ చేస్తున్నాను. వీటితో పాటు మ‌రో రెండు క‌థ‌లు లాక్ చేసి పెట్టాను. క‌థ న‌చ్చితే వెబ్ సిరీస్‌లు చేయ‌డానికి సిద్ద‌మే. అలాగే 'వాలి' సినిమాలో అజిత్, 'ప్రేమ చ‌ద‌రంగం' సినిమాలో భ‌ర‌త్ పోషించిన నెగెటివ్ రోల్స్‌లో నటించాలని ఉంది. అలాంటి కథతో ఎవరైనా వస్తే.. తప్పకుండా చేస్తాను.." అని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement