అంతకుమించి...

ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది... ‘అంతకుమించి’ అని. ఇప్పుడు ప్రభాస్‌ నటిస్తున్న ‘ఆదిపురుష్‌’ చిత్రం గురించి భవిష్యత్‌లో అలాగే చెప్పుకోవాలేమో! విషయం ఏమిటంటే రామాయణం

అంతకుమించి...

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది... ‘అంతకుమించి’ అని. ఇప్పుడు ప్రభాస్‌ నటిస్తున్న ‘ఆదిపురుష్‌’ చిత్రం గురించి భవిష్యత్‌లో అలాగే చెప్పుకోవాలేమో! విషయం ఏమిటంటే రామాయణం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ నిర్మిస్తున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో ప్రభాస్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతీసనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిన ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెల్లోనే ముంబైలో ప్రారంభం కానుంది. పకడ్బందీగా పేపర్‌ వర్క్‌ పూర్తి చేసుకొని దర్శకుడు ఓం రౌత్‌ రంగంలోకి దిగారు.


ఇప్పటివరకూ విజువల్‌ ఎపెక్ట్స్‌ వర్క్‌ గురించి చెప్పుకోవాలంటే ప్రభాస్‌ హీరోగా రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి 2’ సినిమానే  ప్రస్తావించాలి. ఆ చిత్రంలో 2500 విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్‌ ఉన్నాయి. ఏది నిజమైనా షాటో, ఏది విజువల్‌ ఎఫెక్టో తెలియనంతగా అవి సినిమాలో ఇమిడిపోయాయి. తన ప్రతిభకు ఇలా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, అద్భుతంగా ‘బాహుబలి ’ చిత్రాన్ని రాజమౌళి రూపొందించి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకొన్నారు.


ఇక ఇప్పుడు ‘ఆదిపురుష్‌’ చిత్రంతో ఆ రికార్డ్‌ను దర్శకుడు ఓం రౌత్‌ అధిగమించనున్నారు. ఆ చిత్రంలో ఉన్న విఎ్‌ఫఎక్స్‌ షాట్స్‌ ఎన్నో తెలుసా... 8000. అంటే ‘బాహుబలి’లో ఉన్న విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంటే మూడు రెట్లు అధికం అన్నమాట. భారతీయ సినిమా చరిత్రలోనే ఇంతపెద్ద ఎత్తున విజువల్‌ షాట్స్‌తో తీస్తున్న తొలి సినిమా ఇదే. అంటే  ‘ఆదిపురుష్‌’ చిత్రం ఏ రేంజ్‌లో ఉండబోతోందో ఊహించుకోండి.

Updated Date - 2021-06-13T05:30:00+05:30 IST