Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 30 Jun 2022 11:09:54 IST

ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమాని తల్లిని ఫోన్‌లో పరామర్శించిన NTR

twitter-iconwatsapp-iconfb-icon

అభిమాన హీరోల్ని ఆరాధించే వారు కోట్లల్లో ఉంటే.. తమని ఆరాధించే వారి పట్ల అభిమానం చూపించే హీరోలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. నిజానికి వారి అభిమానమే హీరోల్లో ఉత్సాహం నింపుతుంది. వారిని పూర్తిగా సంతృప్తిపరిచే స్థాయిలో తమ హీరోయిజాన్ని తెరపై చూపించాలనే తపనతో మంచి కథాంశాల్ని ఎంపిక చేసుకుంటారు. అయితే అంతగా ప్రాణం పెట్టే తమ అభిమానులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే కరిగిపోని హీరోలు ఎవరైనా ఉంటారా? తాజాగా యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR) అభిమానికి ఆ పరిస్థితి వచ్చింది. పేరు జనార్ధన్. అతడికి యన్టీఆర్ అంటే.. వీరాభిమానం. 


తారక్ (Tharak) సినిమాల్ని రిలీజ్ రోజునే చూసి.. అతడి డైలాగ్స్ ను, డ్యాన్స్ ను తనివితీరా ఎంజాయ్ చేయందే జానార్ధన్‌కు నిద్రపట్టదు. అయితే అతడు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. తన పట్ల అంతగా అభిమానం చూపించే ఆ అభిమాని పరిస్థితికి కదిలిపోయారు యన్టీఆర్. వెంటనే స్పందించి.. అతడి తల్లిని ఫోన్ లో పరామర్శించి అతడి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకొన్నారు. జనార్ధన్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్దించి.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ అభిమాని తల్లితో యన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement