Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 21:30:02 IST

Nikhil: ఫుల్ టైమ్ డాక్టర్‌ని.. పార్ట్ టైమ్ డిటెక్టివ్‌ని!

twitter-iconwatsapp-iconfb-icon

యంగ్ హీరో నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా.. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya)కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌తో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఆగస్ట్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో నిఖిల్.. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. 


‘‘చందు మొండేటిగారు నాకు ఈ లైన్‌ను 2016లో చెప్పారు. పార్ట్ 1 కంటే బాగుండాలని.. కథపై ఆయన ఎంతో ఎఫర్ట్ పెట్టారు. పాండమిక్ వలన ఈ సినిమా రెండున్నర సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు కథ, మాటలు చాలా బాగా కుదిరాయి. ఇందులో నేను ఒక ఫుల్ టైం డాక్టర్‌గా, పార్ట్ టైం డిటెక్టివ్‌గా నటిస్తున్నాను. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే దాన్ని అడ్వెంచర్ చేయడానికి వెళ్లే పాత్రలో నటించాను. హిస్టరీ వర్సెస్ మైథాలజీ‌గా ఈ సినిమా ఉంటుంది. ప్రతి సీన్‌కు ఒక మీనింగ్ ఉండే.. మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌. దేవుడు ఉన్నాడా? లేడా? అనే వారికి ఈ సినిమా నచ్చుతుంది. దేవుడంటే ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించడం జరిగింది. కొన్ని కొన్ని సీన్స్ కొండల్లో చేయడం జరిగింది. చాలామంది కొండల్లో అంటే గ్రాఫిక్స్ పెట్టిస్తారు. కానీ మేము పాండమిక్‌కు ముందు.. తర్వాత కూడా రియల్‌గా కొండల్లో చిత్రీకరించాము. (Nikhil Interview)

Nikhil: ఫుల్ టైమ్ డాక్టర్‌ని.. పార్ట్ టైమ్ డిటెక్టివ్‌ని!

మూవీ కొంత నార్త్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి అనుపమ్ ఖేర్‌గారిని తీసుకోవడం జరిగింది. తను చాలా గ్రేట్ పర్సన్. తనతో చేసే సీన్స్ కొన్ని నాకు భయంగా అనిపించింది. తను చాలా పెద్ద యాక్టర్ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నార్మల్‌గా యాక్ట్ చేయడం జరిగింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడు చూడని విధంగా కనిపిస్తుంది. తను అద్భుతమైన సహనటి. అలాగే ఇందులో నటించిన  వారందరూ  ఎంతో డెడికేటెడ్‌గా నటించారు. ఈ మూవీని అన్ని లాంగ్వేజ్‌లలో డబ్ చేస్తున్నాము. వేరే లాంగ్వేజెస్‌లో రిలీజ్ అవుతున్న నా మొదటి సినిమా ఇదే.


కాలభైరవ చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇందులో ఉన్న మూడు పాటలు  చాలా బాగుంటాయి. అడ్వెంచర్ కథలైన టిన్ టిన్ బుక్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అవి చందూకి కూడా చాలా ఇష్టం. ఆ బుక్స్‌ను నేను బాగా చదివేవాడిని. ఇండియానా జోన్స్‌లా మనకు ఎన్నో కథలు ఉన్నాయి. అవన్నీ తీసి భారతదేశ గొప్పతనాన్ని తెలియజేయాలనే కోరిక ఉంది. నెక్స్ట్ గీతా ఆర్ట్స్‌లోని ‘18 పేజెస్’ సినిమా కొంత పెండింగ్ వర్క్ ఉంది. ఆ తరువాత సుధీర్ వర్మతో ఒక సినిమా చేస్తున్నాను. ‘స్పై’ సినిమా ఈ  ఏడాది చివరకు విడుదల అవుతుంది.. ఈ సినిమా కూడా మల్టీ లాంగ్వేజేస్‌లలో ఉంటుంది..’’ అని తెలిపారు. (Nikhil Karthikeya 2 Interview)


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement