డాక్టర్ పల్లవి వర్మతో హీరో నిఖిల్ నిశ్చితార్థం

యంగ్ హీరో నిఖిల్.. రియల్ లైఫ్‌లో డాక్టర్ పల్లవి వర్మ‌తో జతకడుతున్నాడు. రీసెంట్‌గా ‘అర్జున్ సురవరం’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ‌తో ఊపు మీద ఉన్న ఈ కుర్ర హీరో త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరానికి చెందిన అమ్మాయి‌కి ఆయన గోవాలో ప్రపోజ్ చేసి మెప్పించాడు. అంతేకాదు పెద్దల్ని కూడా ఒప్పించాడు. ఎక్కడైతే ప్రపోజ్ చేశాడో అక్కడే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.

 

వివరాల్లోకి వెళితే డాక్టర్ పల్లవి వర్మని ప్రేమించిన నిఖిల్ అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గోవా‌లో శనివారం (ఫిబ్రవరి 1న)  పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఏప్రిల్ 16న పల్లవి వర్మను వివాహం చేసుకోబోతున్నాడు. డాక్టర్ పల్లవికి నిఖిల్ ప్రపోజ్ చేస్తున్నఫొటోలు వైరల్ అవుతున్నాయి.

 

కాగా ‘హ్యాపీడేస్‘ మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నిఖిల్ అనతికాలంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్నమైన కథలను నమ్ముకుంటూ ముందుకెళ్తున్నాడు. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడిపోతావు చిన్నవాడా’, ‘కిరాక్ పార్టీ’ సినిమాలతో నిఖిల్ హిట్లు అందుకున్నారు. తాజాగా ఆయన ‘కార్తికేయ-2’లో నటిస్తున్నాడు.

Advertisement