Oct 28 2021 @ 02:58AM

హీరోగా మరోమెట్టు ఎక్కాలి

సినీ నేపథ్యం లేకున్నా   హీరోగా నాగశౌర్య గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘వరుడు కావలెను’ చిత్రంతో హీరోగా మరో మెట్టు ఎక్కాలి’ అని అల్లు అర్జున్‌ ఆకాంక్షించారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన చిత్రం ‘వరుడు కావలెను’ ఈ నెల 29న విడుదలవుతోంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.