Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 10 2021 @ 16:02PM

Hero Naga Shaurya తండ్రి శివలింగ ప్రసాద్ అరెస్ట్

హైదరాబాద్: సినీ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మంచిరేవుల పేకాట కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవలే శివలింగ ప్రసాద్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయనను అరెస్టు చేశారు. పేకాట కేసులో ప్రధాన నిందితుడైన గుత్తా సుమన్‌తో కలిసి శివలింగప్రసాద్ తన ఫాంహౌస్‌లో పేకాట ఆడిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో శివలింగప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. శివలింగప్రసాద్ కోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు సమాచారం.

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement