20 నుంచి హీరో మోటో ధరల పెంపు

ABN , First Publish Date - 2021-09-17T08:08:29+05:30 IST

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌.. అన్ని మోడళ్ల వాహన ధరలను రూ.3,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

20 నుంచి హీరో మోటో ధరల పెంపు

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌.. అన్ని మోడళ్ల వాహన ధరలను రూ.3,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇన్‌పుట్‌ వ్యయా లు గణనీయంగా పెరగటంతో ధరలను పెంచాల్సి వస్తోందని తెలిపింది. స్కూటర్‌, మోటార్‌ సైకిల్‌ మోడల్‌ను బట్టి ధరల పెంపు రూ.3,000 వరకు ఉంటుందని పేర్కొంది.

Updated Date - 2021-09-17T08:08:29+05:30 IST