హీరో మోటో బైక్‌ ధరల పెంపు

ABN , First Publish Date - 2022-06-24T06:49:02+05:30 IST

ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటో కార్ప్‌ తమ మోటార్‌ బైక్‌లు, స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంచాలని నిర్ణయించింది.

హీరో మోటో బైక్‌ ధరల పెంపు

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటో కార్ప్‌ తమ మోటార్‌ బైక్‌లు, స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంచాలని నిర్ణయించింది. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి. పెరిగిపోయిన కమోడిటీ ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా కొంత మేరకైనా ఆ భారాన్ని కస్టమర్లకు బదలాయించాలని నిర్ణయించినట్లు కంపెనీ రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సందేశంలో తెలిపింది. 

Updated Date - 2022-06-24T06:49:02+05:30 IST