Oct 25 2021 @ 21:19PM

Madhavan కొడుకు వేదాంత్ గురించి నెట్టింట హాట్ టాపిక్.. షారుఖ్ తనయుడు Aryan Khan తో పోల్చుతూ..

నటుడు మాధవన్ తనయుడు స్విమ్మింగ్ పూల్‌లో సంచలనం సృష్టించాడు. 16 ఏళ్ల వేదాంత్ ఏకంగా ఏడు జాతీయ పతకాలు కొల్లగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. బెంగుళూరులో జరిగిన ‘47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్ 2021’లో స్మిమ్మర్‌గా మరోమారు సత్తా చాటాడు. గతంలోనూ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అద్భుతంగా రాణించిన వేదాంత్ ఈసారి పలు రాష్ట్రాల నుంచీ వచ్చిన క్రీడాకారుల్ని వెనక్కి నెట్టి రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు. 


తాజాగా జరిగిన నేషనల్ లెవల్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్‌లో వేదాంత్ నాలుగు రజత, మూడు కాంస్య పతకాలు స్వంతం చేసుకోవటం పలువురి ప్రశంసలకు కారణం అవుతోంది. అభిషేక్ మను సింఘ్వీ లాంటి పొలిటీషన్ కూడా అతడిపై పొగడ్తలు కురిపించారు. వేదాంత్‌ను మాత్రమే కాకుండా మాధవన్ని కూడా సింఘ్వీ మెచ్చుకున్నారు. ఇక ఇంటర్నెట్‌లో అయితే మాధవన్ తనయుడి విజయం కొత్త చర్చకు దారి తీస్తోంది. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ 23 ఏళ్ల వయస్సులో, డ్రగ్స్ కేసులో, ఆరోపణలు ఎదుర్కోవటం... జైలులో ఉండాల్సి రావటం... మనకు తెలిసిందే. కానీ, 16 ఏళ్లకే మాధవన్ వారసుడు దేశం గర్వించేలా చేశాడంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పెంపకం అంటే మాధవన్‌దేనంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు... 

Bollywoodమరిన్ని...