Abn logo
Sep 19 2020 @ 10:01AM

కార్తికేయ రెడీ అవుతున్నాడు!

Kaakateeya

లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లకు, సినిమాలకు బ్రేక్ రావడంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆరు నెలలపాటు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో ఇప్పుడిప్పుడే కొందరు బయటకు వస్తున్నారు. మెల్లిమెల్లిగా షూటింగ్‌లు ప్రారంభిస్తున్నారు. 


యంగ్ హీరో కార్తికేయ కూడా తన సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాడు. ఈ నేపథ్యంలో కెమేరా ముందు నిల్చుని కొన్ని స్టిల్స్ ఇచ్చాడు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. `చాలా రోజుల తర్వాత షూటింగ్ ప్రారంభమవుతోంది. కాబట్టి కెమేరా కొంచెం అలవాటు అవుతుందని..` అంటూ కామెంట్ చేశాడు. 



Advertisement
Advertisement
Advertisement