Jul 6 2021 @ 10:00AM

సీఎం స్టాలిన్‌ను కలిసిన హీరో కార్తి

ప్రముఖ తమిళ సినీ నటుడు కార్తి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను సోమవారం సాయంత్రం సచివాలయంలో కలుసుకున్నారు. కార్తితోపాటు ప్రముఖ సినీనటి రోహిణి, తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు ఎన్‌.రామసామి తదితరులు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై చర్చించారు. ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎంతో సమావేశం అనంతరం నటుడు కార్తి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సినీ ఛాయాగ్రహ చట్ట సవరణ వల్ల సినీ కార్మికులు, నిర్మాతలందరూ తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. సినిమాలకు సెన్సార్‌ సర్టిఫికెట్లు మంజూరు కాకపోతే కేంద్ర ప్రభుత్వాన్నే ఆశించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుందని సినీ రంగ ప్రముఖులంతా ఆందోళన చెందుతు న్నారని కార్తి తెలిపారు. ఈ చట్టం వల్ల ప్రస్తుతం సెన్సార్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు, ఇకపై తీయబోయే సినిమాలకు నష్టం వాటిల్లుతుందని ఈ వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామని ఆయన చెప్పారు.

Otherwoodsమరిన్ని...