Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 07 Oct 2021 18:41:47 IST

క్యాబ్‌ డ్రైవర్‌పై చిర్రుబుర్రులాడిన హీరోయిన్.. మీదే తప్పంటూ అతడు చెప్పినా వినకుండా..

twitter-iconwatsapp-iconfb-icon

సెలెబ్రిటీల వివాదాలకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో రామ్ చరణ్ తేజ్ ఒక కారు వివాదంలో ఇరుక్కున్నాడు. అప్పట్లో ఆ వివాదం పతాక శీర్షికలకెక్కింది. తాజాగా ఒక హీరోయిన్ కారు డ్రైవర్‌తో గొడవ పెట్టుకుని అటువంటి వివాదంలోనే ఇరుక్కుంది. ఈ వివాదంతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల్లోకి వెళ్లితే..



క్యాబ్‌ డ్రైవర్‌పై చిర్రుబుర్రులాడిన హీరోయిన్.. మీదే తప్పంటూ అతడు చెప్పినా వినకుండా..

బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రం ద్వారా టాలీవుడ్‌లో కెరీర్‌ను ఆరంభించిన నటి సంజన గల్రానీ.  ఆమె ఒక షూటింగ్ నిమిత్తం ఇందిరా నగర్ నుంచి కంగేరికి ఓలా క్యాబ్ ను బుక్ చేసుకోవాలనుకుంది. కానీ, కంగేరికి బదులుగా ఆర్‌ఆర్.నగర్‌కు క్యాబ్ ను బుక్ చేసుకుంది. అనంతరం తన పనిలో పడిపోయింది. మార్గమధ్యంలో ఉండగా ఆమె వేరే  ప్రాంతానికి వెళ్తున్నట్లు గుర్తించింది. తనను కంగేరికి తీసుకువెళ్లాలని క్యాబ్ డ్రైవర్‌ను కోరింది. అందుకు అతడు అంగీకరించలేదు. ‘‘ క్యాబ్‌ను మీరు ఆర్‌ఆర్.నగర్‌కు బుక్ చేసుకున్నారు. జీపీఎస్ లోకేషన్‌ను చూడండి. ఈ ట్రిప్‌ను క్యాన్సిల్ చేసుకుని కంగేరికి క్యాబ్‌ను బుక్ చేసుకోండి ’’ అని సమాధానమిచ్చారు. ఫలితంగా హీరోయిన్‌కు కోపం వచ్చి క్యాబ్ డ్రైవర్‌పై చిర్రుబుర్రులాడింది. అతడిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రతిగా అతడు కూడా హీరోయిన్‌పై ఫిర్యాదు చేశాడు. 



తనతో క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. తనను కిడ్నాప్ చేయడానికి అతడు ప్రయత్నించాడని చెప్పింది. ఏసీని  పెంచమని అడిగితే అతడు పెంచలేదని తనను, తన తల్లిని, సోదరిని బూతులు తిట్టాడని ఆరోపించింది. అనంతరం పోలీసు స్టేషన్‌లో అతడిపై కంప్లైట్ చేసింది. ఈ సంఘటన మొత్తాన్ని ఆమె ట్విటర్‌లో పోస్ట్ చేసింది. హీరోయినే తనను తిట్టిందని క్యాబ్ డ్రైవర్ తిరిగి ఆమెపై ఫిర్యాదు చేశాడు. క్యాబ్ డ్రైవర్ పొట్టకూటి కోసం పని చేస్తున్నడు కాబట్టి అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆమె కోరడం కొసమెరుపు.   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement