హెరిటేజ్‌ ఆదాయం రూ.820 కోట్లు

ABN , First Publish Date - 2022-07-30T09:00:30+05:30 IST

ప్రస్తుత ఆర్థి క సంవత్సరం జూన్‌తో ము గిసిన తొలి త్రైమాసికానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ నికర లాభం రూ.7.3 కోట్లుగా నమోదైంది.

హెరిటేజ్‌ ఆదాయం రూ.820 కోట్లు

హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థి క సంవత్సరం  జూన్‌తో ము గిసిన తొలి త్రైమాసికానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ నికర లాభం రూ.7.3 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలానికి ఆర్జించిన రూ.30.27 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 75.98 శాతం తగ్గింది. త్రైమాసిక సమీక్షా  కాలంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 27 శాతం వృద్ధి చెంది రూ.820.9 కోట్లకు చేరుకుంది. గడిచిన త్రైమాసికంలో కంపెనీ రోజువారీ పాల విక్రయా లు వార్షిక ప్రాతిపదికన 15.05 శాతం పెరిగి 10.93 లక్షల లీటర్లుగా నమోదయ్యాయి. రోజువారీ పెరుగు విక్రయాలు 45.39 శాతం వృద్ధితో 424.09 మెట్రిక్‌ టన్నులకు చేరుకున్నాయి. వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ (వీఏపీ) విక్రయాల ఆదాయం 62.5 శాతం పెరిగి రూ.283.8 కోట్లుగా నమోదైంది. మొత్తం డెయిరీ ఆదాయంలో వీఏపీ విభాగ వాటా 34.86 శాతానికి పెరిగిందని  తెలిపింది. సవాళ్ల సమయంలోనూ సుస్థిర వృద్ధి సాధనకు కృషి చేస్తున్నామని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రహ్మణి అన్నారు. సమీక్షా కాలానికి కంపెనీ ఆదాయం మెరుగైన వృద్ధిని నమోదు చేసుకోగలిగినప్పటికీ..పాల సేకరణ, నిర్వహణ వ్యయా లు పెరగడం లాభాలను పరిమితం చేసిందన్నారు. 

Updated Date - 2022-07-30T09:00:30+05:30 IST