రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్‌ నగరంగా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2020-10-30T06:55:26+05:30 IST

నగరంలోని ముఖ్య ప్రదేశాలను రాష్ట్ర ఆర్కియాలజీ కమిషనర్‌ వాణీ మోహన్‌ పరిశీలించారు.

రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్‌ నగరంగా తీర్చిదిద్దుతాం
మ్యూజియంలో పురాతన నందీశ్వరుడిని పరిశీలిస్తున్న కమిషనర్‌ వాణీమోహన, ఎంపీ భరత

  • ఆర్కియాలజీ కమిషనర్‌ వాణీమోహన్‌  
  • రాళ్లబండి మ్యూజియం, పురాతన ఆలయాలు సందర్శన

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 29: నగరంలోని ముఖ్య ప్రదేశాలను రాష్ట్ర ఆర్కియాలజీ కమిషనర్‌ వాణీ మోహన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్‌ నగరంగా తీర్చిదిద్దు తామన్నారు. గురువారం ఆమె ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలిలతో కలిసి రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, మెయిన్‌రోడ్డులోని రాయల్‌ మాస్క్‌ (పెద్దమసీదు), కంభం సత్రం సమీపంలోని  11వ శతాబ్దం నాటి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కోటగుమ్మం, చిత్రాంగి అతిథిగృహం, దాని సమీపంలో కాటన్‌దొర కుమార్తె సమాధి, రాజమహేంద్రవరం క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి ఆలయం, కందుకూరి నివాసం, టౌన్‌ హాలు ప్రాం తాలను పరిశీలించారు. అనంతరం వాణీమోహన మాట్లా డుతూ ఇక్కడ ప్రాచీన, సాంస్కృతిక సంపద ఉందని, రానున్న రెండేళ్లలో కొత్తగా రూపుదిద్దుకోగలదన్నారు. ధవళేశ్వరం జనార్దనస్వామి ఆలయాన్ని, కాటన్‌ మ్యూజియాన్ని వారు పరిశీలించారు. పర్యటనలో ఆర్కియాలజీ జాయింట్‌ డైరెక్టర్‌ తిమ్మరాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైసీపీ నాయకులు గిరజాల బాబు, అజ్జరపు వాసు, కానబోయిన సాగర్‌, రాష్ట్ర గాండ్ల, తెలుకుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సంకిస భవానీ ప్రియ, నాయకులు మార్గాని చంటిబాబు, డాక్టర్‌ అనసూరి పద్మలత, పోలు విజయలక్ష్మి పాల్గొన్నారు.

గంట ఆలస్యంగా నిత్యహారతి

గోదావరి సిటీ, అక్టోబరు 29: గోదావరి నిత్య హారతి గురువారం సాయంత్రం ఆలస్యంగా ప్రారంభమైంది. పురావస్తు శాఖ కమిషనరు డాక్టర్‌ వాణీమోహన్‌ వస్తున్నారని సమాచారం రావడంతో 6:30కు ప్రారంభించవలసిన హారతిని నిలుపుదల చేశారు. కానీ ఆమె రాకపోవడంతో 7:28 గంటలకు హారతిని ప్రారంభించారు. 

Updated Date - 2020-10-30T06:55:26+05:30 IST