passport: పాస్‌పోర్ట్ లేనివాళ్లు ఇలా దరఖాస్తు చేసుకుంటే వచ్చేస్తుంది.. చాలా ఈజీ

ABN , First Publish Date - 2022-09-23T01:54:18+05:30 IST

విద్య, వైద్యం, విహారయాత్రలు, వ్యాపార పనులు ఇలా అవసరమేదైనా విదేశాలు వెళ్లాలనుకునే భారతీయులకు పాస్‌పోర్ట్ తప్పనిసరిగా ఉండాల్సిందే.

passport: పాస్‌పోర్ట్ లేనివాళ్లు ఇలా దరఖాస్తు చేసుకుంటే వచ్చేస్తుంది.. చాలా ఈజీ

విద్య, వైద్యం, విహారయాత్రలు, వ్యాపార పనులు ఇలా అవసరమేదైనా విదేశాలు వెళ్లాలనుకునే భారతీయులకు పాస్‌పోర్ట్(passport) తప్పనిసరిగా ఉండాల్సిందే. లేదంటే దాటి బయట కాలుపెట్టడానికి వీల్లేదు. భారత ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్ట్ మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాల్లో అధికారిక డాక్యుమెంట్‌గా గుర్తించబడుతుంది. మిగతావి ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నా కుదరదు. ఇక గత కొన్నేళ్లుగా విదేశీ యాత్రలు చేస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తదనుగుణంగా పాస్‌పోర్ట్‌కు డిమాండ్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌‌కు తగ్గట్టు సేవలు అందించడమే లక్ష్యంగా విదేశీ వ్యవహారాల శాఖ (Ministry of External Affairs (MEA) 2010 మే నెలలో పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్(passport seva project)ని ప్రారంభించింది. పాస్‌పోర్ట్ సేవా ద్వారా దరఖాస్తు చేయడం, జారీ ప్రక్రియలను సులభతరం చేయడంతోపాటు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుభాగంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్‌పోర్ట్ పొందొచ్చు. ఈ ప్రక్రియలో డాక్యుమెంట్లు సమర్పించడంతోపాటు రాష్ట్ర పోలీసులు భౌతిక ధృవీకరణ(physical verification) చేయాల్సి ఉంటుంది. అన్నీ పూర్తయిన తర్వాత పాస్‌పోర్టును దరఖాస్తుదారుడి అడ్రస్‌కి పోస్ట్ ద్వారా చేరుతుంది.


వేర్వేరు అవసరాలపై విదేశాలకు వెళ్లాలనుకునేవారు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే పాస్‌పోర్ట్ సేవా (passport Seva) వెబ్‌ పోర్టల్‌పై ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు. 


ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయండి..

 

Step 1: పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్ ‘పాస్‌పోర్ట్‌ఇండియా.గవ్.ఇన్ (passportindia.gov.in.) ఓపెన్ చేయాలి.

Step 2: హోం స్ర్కీన్‌పై ‘రిజిస్టర్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

Step 3: రిజిష్టర్డ్ లాగిన్ ఐడీతో పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి

Step 4: ఫ్రెష్ పాస్‌పోర్ట్/పాస్‌పోర్ట్ రీ-ఇష్యూ కోసం ‘అప్లై’ బటన్‌పై క్లిక్ చేయాలి.

Step 5: ఫామ్‌లో అవసరమైన వివరాలన్ని నింపిన తర్వాత సబ్‌మిట్‌ ఆప్షన్‌పై ఎంటర్ చేయాలి.

Step 6: వ్యూవ్ సేవ్డ్/సబ్మిట్ అప్లికేషన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.

Step 7: ‘పే అండ్ షెడ్యూల్డ్ అపాయింట్‌మెంట్’ క్లిక్ చేసి సంబంధిత సేవ కోసం కనీస ఛార్జీలు చెల్లించాలి.

నోట్: పీఎస్‌కే/పీవోపీఎస్‌కే/పీవో అపాయింట్ల బుకింగ్ కోసం ఖచ్చితంగా ఆన్‌లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ అప్లికేషన్ ఫీజు రూ.1500 కాగా.. తాత్కాల్ పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫీజు రూ.2,000 గా ఉంది.

Step 8 : నెట్ బ్యాంకింగ్ లేదా మరో ఆప్షన్ ద్వారా ఫీజు చెల్లించిన తర్వాత.. ‘ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్’ లింక్‌పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

Step 9: అప్లికేషన్ ఫైలింగ్ చేసిన తర్వాత దరఖాస్తుదారుడి ఫోన్ నంబర్‌కి ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఈ మెసేజ్ పాస్‌పోర్ట్ ఆఫీస్ వద్ద చూపించేందుకు ప్రూఫ్‌గా పనికొస్తుంది. 

Step 10 : పాయింట్‌మెంట్ తేదీన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం(పీఎస్‌కే)/రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్(ఆర్‌పీవో)‌ను సందర్శించాలి.

Updated Date - 2022-09-23T01:54:18+05:30 IST