Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 25 Apr 2022 15:56:39 IST

IPL 2022: Mumbai Indians టీంలో ఒకటి తక్కువైంది పుష్పా.. అందుకే ఈ పరిస్థితి..!

twitter-iconwatsapp-iconfb-icon
IPL 2022: Mumbai Indians టీంలో ఒకటి తక్కువైంది పుష్పా.. అందుకే ఈ పరిస్థితి..!

ఈ IPL 2022 సీజన్‌లో Mumbai Indians జట్టు పరిస్థితి ‘గతమెంతో ఘనం- గతి తప్పిన వర్తమానం’ అన్నట్టుగా తయారైంది. ఐపీఎల్‌లో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు ఇంతటి పరాభవం.. వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లో కూడా ఓడిన చేదు అనుభవం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. Rohit సేన పూర్వ వైభవం కోల్పోవడానికి అసలు కారణాలు ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఆ జట్టులో కూడా ఇప్పుడు అంతర్గతంగా ఇదే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే.. Lucknow Super Giants టీంతో జరిగిన పోరులో ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ కోచ్ (Mumbai Indians Coach) Mahela Jayawardene కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వరుస ఓటముల తర్వాత జట్టులో కొన్ని కీలక మార్పులు చేయక తప్పేలా లేదని మహేలా చెప్పాడు. ఇక మీదట మ్యాచ్‌ల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలంటే ముంబై బ్యాటింగ్ లైనప్‌లో భారీ మార్పులు ఉండొచ్చని జయవర్ధనే వ్యాఖ్యలతో స్పష్టమైంది.


లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెత్త బ్యాటింగ్‌తో తీవ్ర విమర్శల పాలవుతున్న Ishan Kishan గురించి ప్రశ్నించగా.. ఇషాన్ ఎందుకో కొంత ఒత్తిడికి లోనవుతున్నాడని, తన శైలి బ్యాటింగ్ ఆడేందుకు అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని జయవర్ధనే తెలిపాడు. త్వరలో ఇషాన్ కిషన్‌తో మాట్లాడతానని ముంబై కోచ్ చెప్పాడు. Mumbai Team ఇషాన్ కిషన్‌ను ఈ ఐపీఎల్ వేలంలో రూ.15.25 కోట్లతో చేజారిపోకుండా నిలుపుకుంది. ఇషాన్ నుంచి ముంబై టీం ఎంతో ఆశించింది. అభిమానులు కూడా అతని బ్యాటింగ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. Lucknow Super Giantsతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ టెస్ట్ మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేసి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఒక్క ఫోర్ బాదలేదు. సిక్స్‌ల ఊసే లేదు. 20 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి ‘నీకో దణ్ణం సామీ’ అని అభిమానులు నిట్టూర్చేలా పేలవంగా ఆడి పెవిలియన్‌ బాట పట్టాడు. ఇక.. ముంబై ఫ్యాన్స్ గంపెడంత ఆశలు పెట్టుకున్న Pollard కూడా పుట్టి ముంచాడు. 20 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేసి Mumbai Fanలో నిరాశకు, నీరసానికి కారణమయ్యాడు. ఈ సీజన్‌లో ముంబై జట్టు వరుస ఓటములను నిశితంగా పరిశీలిస్తే ఒక విషయం మాత్రం స్పష్టమైంది. బ్యాట్స్‌మెన్స్ ఆశించినంతగా రాణించకపోవడమే ఆ జట్టు వైఫల్యాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. Mumbai Battingలో స్టార్ ప్లేయర్స్ ఎవరూ ఫామ్‌లో లేరు.


Mumbai Captain Rohit Sharma బ్యాటింగ్ అయితే మరీ ఘోరంగా ఉందని చెప్పక తప్పదు. ఈ సీజన్‌లో ముంబై జట్టు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల మీద కలిపి Rohit Sharma కేవలం 153 పరుగులు మాత్రమే చేశాడంటే అతని బ్యాటింగ్ ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చని స్పోర్ట్స్ ఎనలిస్ట్‌లు చెప్పుకొస్తున్నారు. Rohit Sharma, Ishan Kishan, Pollard బ్యాటింగ్ తీరులో మార్పు రాకపోతే మాత్రం ముంబై మిగిలిన మ్యాచ్‌ల్లో కూడా పరువు కాపాడుకునే పరిస్థితి ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. LSGతో ఓటమి తర్వాత తమ బ్యాటింగ్ బాగోలేదని, తనతో సహా తమ బ్యాట్స్‌మెన్స్ ఆడిన కొన్ని చెత్త షాట్ల మూలంగానే ఓడిపోవాల్సి వచ్చిందని Mumbai Captain Rohit Sharma స్వయంగా అంగీకరించాడు. Mumbai PlayOff Chances దాదాపుగా కోల్పోయినా Rohit సేన మిగిలిన మ్యాచ్‌ల్లో అయినా గెలిచి ఫ్యాన్స్‌కు కొంత ఉపశమనం కలిగిస్తుందో లేక ఓడి ముంబై అభిమానులు ఒకరినొకరు ఓదార్చుకునేలా చేస్తుందో చూడాలి. తరువాయి మ్యాచ్‌ల్లో Mumbai Indian Team బ్యాటింగ్‌లో మాత్రం కీలక మార్పులు తథ్యంగా కనిపిస్తున్నాయి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.